TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పరకాలలో టిఆర్‌ఎస్‌కు జెఎసి మద్దతు ప్రకటించాలి

Published on: Sat May 12, 2012 2:41PM

వరగంల్ జిల్లా పరకాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తెలంగాణ జేఏసీ సంఘాలు కూడా అన్ని విషయాలు ఆలోచనలు చేసి టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని విజయశాంతి విజ్ఞప్తి చేశారు. బీజేపీ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగవడం వల్ల ఓట్లు మాత్రమే చీలుతాయన్నారు. అందువల్ల ఆ పార్టీ బరి నుంచి తప్పుకోవాలన్నారు.పాలమూరులో పరిస్థితులు వేరు... పరకాల స్థానిక పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయన్నారు. బీజేపీ పోటీ నుంచి తప్పుకుని టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని విజయశాంతి డిమాండ్ చేశారు. పరకాలలో తెలంగాణవాదుల ఓట్లు చీలకుండా ఉండాలంటే తెలంగాణ పొలిటికల్ జేఏసీ టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ప్రకటించాలని గట్టిగా కోరారు.