TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

డీఎంకే గూటికి పన్నిర్ సెల్వం

Published on: Fri Feb 27, 2026 2:13PM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామం సంభవించింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ సీఎం పన్నిర్ తెల్వం డీఎంకే గూటికి చేరారు.  గతంలో డీఎంకే ప్రత్యర్థి అన్నాడీఎంకేలో అత్యంత కీలకంగా వ్యవహరించిన పన్నిర్ సెల్వం డీఎంకే గూటికి చేరడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పన్నీర్ సెల్వం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత  నమ్మకస్తుడిగా గుర్తింపు పొందారు.  జయలలిత కోర్టు తీర్పుల కారణంగా సీఎంగా రాజీనామా చేయాల్సి వచ్చిన ప్రతిసారీ తన వారసుడిగా పన్నీర్ సెల్వంను సీఎం కుర్చిలో కూర్జోపెట్టడం రివాజు. అటువంటి పన్నిర్ సెల్వం జయలలిత మరణం తరువాత డీఎంకేలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.

పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. అటువంటి పన్నీర్ సెల్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమక్షంలో డీఎంకే తీర్ధం పుచ్చుకున్నారు.  శుక్రవారం (ఫిబ్రవరి 27) ఉదయం డీఎంకే ప్రధాన కార్యలయంలో  తన కుమారుడు రవీంద్రన్‌తో కలిసి డీఎంకే గూటికి చేరారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం డీఎంకేను తల్లిగా అభివర్ణించారు. "అరిగ్నర్ అన్నా, కలైంజ్ఞర్ కరుణానిధి నిర్దేశించిన మార్గంలో పయనిస్తూ స్టాలిన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని పొగడ్తల వర్షం కురిపించారు.