పన్నీర్ సెల్వం దీక్ష ప్రారంభం.. చెన్నైలో ఉద్రిక్తత..
Published on: Wed Mar 8, 2017 10:12AM
.jpg)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ రోజు దీక్ష ప్రారంభించారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని.. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈరోజు దీక్ష ప్రారంభించారు. చెన్నైలోని రాజరాథినం స్టేడియంలో జరుగుతున్న ఈ దీక్షలో పన్నీర్ సెల్వంతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్నారు. దీక్ష ప్రాంగణానికి భారీ ఎత్తున పన్నీర్ సెల్వం మద్దతుదారులు, ప్రజలు చేరుకుంటున్నారు. దీంతో చెన్నైలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ...జయలలిత మరణంపై సీబీఐతో విచారణ జరిపించడానికి ఆదేశాలు వచ్చే వరకు తాము దీక్షను విరమించబోమని స్పష్టం చేశారు.


