పన్నీర్ సెల్వం నిరాహార దీక్షకు గ్రీన్ సిగ్నల్...
Published on: Tue Mar 7, 2017 9:20AM
.jpg)
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై పలు అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మ మృతిపై దర్యాప్తు చేయించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు దీనిలో భాగంగా ఆయన నిరాహార దీక్ష కూడా చేపట్టనున్నారు. ఈ దీక్షకు సంబంధించి పన్నీర్ సెల్వంకు గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా తాను చేపట్ట తలచిన నిరాహార దీక్షలకు డీజీపీ కార్యాలయం అనుమతినిచ్చింది. గత నెల 28న చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో అనుమతి కోరినప్పటికీ సమాధానం రాకపోవడంతో, పన్నీర్ సెల్వం ఆయన వర్గం నేతలు విశ్వనాథన్, మునుస్వామి, ప్రభాకర్, మైత్రేయన్ తదితరులు డీజీపీని ఆశ్రయించారు. విజ్ఞాపనపత్రాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వచ్చే బుధవారం నాడు తాము చేపట్టనున్న దీక్షలకు అనుమతి లభించిందని, తాము ధర్మయుద్ధం చేస్తున్నామని తెలిపారు. శశికళ మాఫియాలో చిక్కుకున్న రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యమని తెలిపారు.


