TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించిన సింగర్ మంగ్లీ...ఆరోపణల ట్విస్ట్

Published on: Sun Apr 12, 2026 5:11PM

 

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రముఖ గాయని సత్యవతి ముడావత్ (మంగ్లీ) ఇచ్చిన ఫిర్యాదు సంచలనంగా మారింది. నేరపూరిత బెదిరింపులు, దుర్భాష మరియు బలవంతపు వసూళ్ల ఆరోపణలతో ప్రారంభమైన ఈ వ్యవహారం, తరువాత 10 కోట్ల మోసం ఆరోప ణలతో మరో మలుపు తిరిగి పరస్పర ఆరోపణల కేసుగా మారింది. మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే..  ఈ ఏడాది మార్చి 22న సాయంత్రం సుమారు నాలుగు గంటల సమయంలో ఆమె ఒక న్యాయవాది కార్యాలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ సింగపోగు సుబ్బు అనే వ్యక్తి మరో ముగ్గురితో కలిసి ఉన్నట్లు తెలిపింది. 

సుబ్బు తనను న్యాయవాది గా పరిచయం చేసుకున్నాడని, కొద్దిసేపటికి తనతో అనుచితంగా మాట్లాడటం ప్రారంభించాడని ఆమె తన ఫిర్యాదు లో పేర్కొన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార మ్‌లలో ఉన్న కొన్ని వీడియోలను తొలగిం చేందుకు తన నుంచి పది లక్షల రూపాయలు ఇవ్వా లని డిమాండ్ చేశాడని ఫిర్యాదులో వెల్లడించారు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని మంగ్లీ ఆరోపించారు. తనపై అసభ్య పదజాలంతో దుర్భాషలాడటమే కాకుండా మీడియా ముందు పరువు నష్టం చేస్తామని బెదిరించారని, డిమాండ్ నెరవేర్చక పోతే సోషల్ మీడియాలో దుష్ప్రచారం కొనసాగిస్తామని హెచ్చరించారని మంగ్లీ తన ఫిర్యాదులో పేర్కొ న్నారు. 

ఈ చర్యలు నేరపూ రిత బెదిరింపులు, వేధింపులు మరియు బలవంతపు వసూళ్లకు చెందినవని ఆమె పేర్కొంటూ సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.ఈ వ్యవహారం ఇక్కడితో ముగియక ముందే కేసు మరో మలుపు తిరిగింది. ఇదే సమయంలో గాయని మంగ్లీపై మైక్రో ఫైనాన్స్ పేరుతో సుమారు పది కోట్ల రూపాయల మోసం జరిగిందని ఆరోపిస్తూ అడ్వకేట్ సుబ్బారావు ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.. 

దీంతో ఈ వివాదం పరస్పర ఆరోపణల దిశగా మారింది. రెండు ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు డిజిటల్ ఆధారాలు, సోషల్ మీడియా కంటెంట్ మరియు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ప్రముఖ గాయని పేరు వినిపించడం వల్ల ఈ ఘటన సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీసింది. రెండు వైపులా తీవ్రమైన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కేసు దర్యాప్తు పూర్తి అయిన తర్వాతే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.