జమ్మూ, కశ్మీర్ ఉగ్ర కాల్పుల్లో చిత్తూరు వాసి పంగల కార్తిక్ మృతి
Published on: Tue Jan 21, 2025 11:02AM
జమ్మూ, కశ్మీర్ సోపార్ లో భధ్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎపికి చెందిన జవాను అమరుడయ్యాడు. చిత్తూరు జిల్లాకు చెందిన పంగల కార్తిక్ (28) పై ముష్కరమూకలు కాల్పులు జరపగా అక్కడికక్కడే చనిపోయినట్టు అధికారులు తెలిపారు. సోపార్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా భద్రతా బలగాలపై తెగబడ్డారు.


