ఆన్ లైన్ లో మంచు పాండవులు
Published on: Sat Feb 1, 2014 9:26AM

శ్రీవాస్ దర్శకత్వంలో మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ లు కలిసి నటించిన మల్టీ స్టారర్ "పాండవులు పాండవులు తుమ్మెద" చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అయితే 30 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ఆన్ లైన్ లో కూడా అభిమానులను అలరించబోతుంది. ముందుగా యూరప్, దక్షిణాఫ్రికా ప్రాంతాలలో మాత్రమే ఈ సౌకర్యం రానుంది. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ఈ విధంగా చేయడం ద్వారా పైరసీని అరికట్టే అవకాశం ఉందని విష్ణు తెలియజేశాడు.


