పంచాయతీకే పోరంబోకులపై అథికారం?
Published on: Sat Jul 7, 2012 1:03PM
పంచాయతీ పోరంబోకు భూములంటే అందరికీ లోకువే. ఆక్రమించుకోవాలనుకున్న వాడూ ముందుగా ఎంచుకునే భూమి కూడా పోరంబోకు భూములే. కబ్జాలతో కునారిల్లుతున్న ఈ పోరంబోకు భూముల వ్యవహారంలో నేతలు కూడా ఆక్రమణదారుల పక్షాన్న నిలుస్తారు. అయితే పంచాయతీలు కూడా ముందు బెట్టుచేసినా పోరంబోకు భూములను ఆక్రమణదారులకే కట్టబెడుతున్నాయి. నేతల ఆబ్లిగేషన్ అంటూ ఆ ఆక్రమణలకు సర్దుకుంటున్నారు. ప్రత్యేకించి కోట్లాది రూపాయల భూమిని అలా వదిలేస్తున్నారు. దీనికి తోడు ఆక్రమణదారుడు కనుక జిల్లా కలెక్టర్, మంత్రుల నుంచి ఏమైనా పత్రాలు తీసుకువస్తే దానికే పోరంబోకు భూములను పంచాయతీ సభ్యులు కట్టబెట్టేస్తున్నారు.
కలెక్టర్‌ను ఎదిరించి భూములను సొంతం చేసుకోలేమన్న భావన సభ్యులకు ఉంది. ఇంకోరకంగా జిల్లాలోని అన్ని పంచాయతీలకు ఛైర్మన్ తరహాలో కలెక్టర్ వ్యవహరిస్తారు. అందుకని పంచాయతీ సభ్యులు కొన్ని పోరంబోకులు కలెక్టర్ ఆదేశాలపై పట్టాలుగా పంపిణీ చేస్తున్నారు. తాజాగా హైకోర్టు మొత్తం విషయం తెలుసుకుని పంచాయతీకే పోరంబోకుభూములపై అథికారం ఉంటుందని తేల్చింది. భూ పరిపాలన శాఖ ప్రథానకమిషనర్‌కు కూడా ఎటువంటి హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కలెక్టర్ వంటి ప్రముఖులు సిఫార్సు చేసినా పట్టించుకోనక్కరలేదని పేర్కొంది. జస్టీస్ వివిఎన్ రావు, జస్టీస్ కృష్ణమోహనరెడ్డిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.


