స్థానిక ఎన్నికల కోసం ఎదురుచూపులు
Published on: Fri Jun 29, 2012 11:25AM
రాష్ట్రప్రభుత్వం తాజాగా తెరపైకి తెస్తున్న స్థానిక ఎన్నికల కోసం నెల్లూరు జిల్లాలో వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తే 1754మందికి పదవులు లభిస్తాయి. జిల్లాలోని 961 పంచాయతీల్లో పదవులు లభిస్తాయి. అలానే 598 మందికి ఎంపిటిసిలుగా మండలాలను పాలించే అవకాశం లభిస్తుంది. 46 మంది జెడ్పిటిసి సభ్యులుగా ఎన్నికవటానికి అవకాశం ఉంటుంది. 195 మంది మున్సిపల్ కార్పొరేటర్లు అయ్యే ఛాన్స్ లభిస్తుంది. ఇంకా మండలాధ్యక్షులు, జిల్లాపరిషత్తు ఛైర్మన్లు, పంచాయతీ సర్పంచ్లు కూడా వీరిలోనే ఎన్నికవుతారు. అంతే కాకుండా పార్టీలకు గ్రామస్థాయి దాకా పట్టుపెరుగుతుంది. ప్రధానంగా జిల్లాలో ఈ ఎన్నికలు నెల్లూరు, కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేటల్లో ఈ స్థానిక ఎన్నికల ప్రభావం కనిపిస్తుంది.


