TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

పనామాలో ఘోర ప్రమాదం..18 మంది దుర్మరణం

Published on: Mon Mar 6, 2017 9:00AM

పనామాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 50 మంది కూలీలను తీసుకువెళ్తున్న ఓ బస్సు రాజధాని పనామా సిటీకి నైరుతి దిశగా 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆంటన్‌లో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను హెలికాఫ్టర్‌ల సహాయంతో ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.