టెన్త్ స్టూడెంట్ పల్లవిపై అత్యాచారం జరిగింది
Published on: Fri Aug 31, 2012 10:56AM
కృష్ణాజిల్లాలో టెన్త్ విద్యార్థిని పల్లవి మృతికేసులో కీలక విషయాలు బైటపడ్డాయి. జూలై 13న అనుమానాస్పదరీతిలో చనిపోయిన పల్లవిపై ప్రాణాలు పోవడానికి కొద్ది సేపుముందే అత్యాచారం జరిగిందని ఫోరెన్సిక్ నివేదికలో బైటపడింది. స్కూల్ భవనం టెర్రస్ మీద చనిపోయి పడున్న పల్లవిని పాఠశాల యాజమాన్యమే హత్యచేసుంటారని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఫోరెన్సిక్ నివేదికలో కొత్త విషయం బైటపడడంతో బాధిత కుటుంబం బాధతో రగిలిపోతోంది. నిందితుల్ని పట్టుకుని తీవ్రంగా శిక్షించేవరకూ తమ ఆవేదన చల్లారదని పల్లవి తల్లిదండ్రులు మండిపడుతున్నారు. అన్యాయంగా ప్రాణాలు పోగొట్టుకున్న తమ బిడ్డను తలచుకుని కుమిలికుమిలి ఏడుస్తున్నారు. అత్యాచారం జరిగాక అవమానం భరించలేక పల్లవి ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంలోకూడా దర్యాప్తు జరుగుతోంది.


