తమిళనాడు అసెంబ్లీలో ఆ రోజు ఏం జరిగింది

పన్నీర్ సెల్వం‌ను కాదని పళనిస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు తమిళనాడు ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు. సీఎంగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేసినప్పటికి..అసెంబ్లీలో తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. దీంతో ఇరుపక్షాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీలో ఏం జరుగుతుందా అని దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే పన్నీర్ వర్గంతో పాటు డీఎంకే సభ్యులు రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టడం, స్పీకర్ దానిని తిరస్కరించడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

 

డీఎంకే ఎమ్మెల్యేలు ఏకంగా సభాపతి కుర్చీలో కూర్చోవడం, రికార్డులను, మైకులను ధ్వంసం చేయడంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి వారిని బయటకు ఈడ్చుకెళ్లారు. దీంతో స్టాలిన్ చినిగిన చొక్కాతో దీక్షకు దిగడం సంచలనం సృష్టించింది. దీనిపై ఇరువర్గాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ రోజు శాసనసభలో జరిగిన విధ్వంసంపై నివేదిక ఇవ్వాలంటూ అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు వీడియో ఆధారాలతో కూడిన నివేదికను అసెంబ్లీ కార్యదర్శి రాజ్‌భవన్‌కు అందించారు.