TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎంగా తొలి సంతకం చేసిన పళనిస్వామి

Published on: Mon Feb 20, 2017 2:04PM

తమిళనాడు ముఖ్యమంత్రిగా పళనిస్వామి బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ సచివాలయానికి వచ్చిన ఆయనకు ఉన్నతాధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. అనంతరం తన ఛాంబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. వేదపండితులు ఆయనను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జయలలిత ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీల దస్త్రాలపై తన తొలి సంతకాన్నిచేశారు. మహిళలకు 50 శాతం రాయితీ, 500 మద్యం దుకాణాల దస్త్రంపైనా సంతకాలు చేశారు.