TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పాక్ నమ్మదగ్గ దేశం కాదు.. ఇజ్రాయెల్

Published on: Thu Apr 9, 2026 2:18PM

పాకిస్థాన్ ఏ మాత్రం నమ్మదగ్గ దేశం కాదని ఇజ్రాయెల్ కుండబద్దలు కొట్టింది. అమెరికా  ఇరాన్ దేశాల మధ్య  శాంతి చర్చలలో పాకిస్థాన్ మధ్యర్తిత్వం చేస్తున్న తరుణంలో అమెరికాకు అత్యంత మిత్రదేశమైన ఇజ్రాయెల్.. పాకిస్ధాన్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఇరాన్, అమెరికాల మధ్య పాకిస్థాన్ మీడియోటర్ పత్ర పోషించడాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నది. ఈ విషయాన్ని భారత్ లో ఇజ్రాయెల్  రాయబారి  రూవెన్ అజార్ తాజా వ్యాఖ్యలతో ప్రస్ఫుటమైంది.  పాకిస్థాన్‌ను తాము ఎంతమాత్రం విశ్వసనీయమైన దేశంగా పరిగణించడం లేదని రూవెన్ అజార్ ఎలాంటి బేషజాలకూ పోకుండా స్పష్టంగా చెప్పారు.

అమెరికా తన సొంత ప్రయోజనాల కోసమో,  వ్యూహాత్మక కారణాల రీత్యానో  పాకిస్థాన్ సేవలను వినియోగించుకోవచ్చని, అయితే ఇజ్రాయెల్   దృష్టిలో మాత్రం ఆ దేశం ఏ మాత్రం నమ్మదగినది కాదని రూవెన్ అజార్ స్పష్టం చేశారు. గతంలో గాజా సంక్షోభం సమయంలో ఖతార్, టర్కీ వంటి దేశాలతో అమెరికా పని చేసిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తు చేస్తూ..  ఇప్పుడు పాకిస్థాన్ విషయంలోనూ అదే తరహా అనుమానాలు ఉన్నాయన్నారు.  అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తాయని ఆశిస్తున్నప్పటికీ, మధ్యవర్తుల ఎంపిక విషయంలో తమకు భిన్నమైన అభిప్రా యాలు ఉన్నాయని కుండబద్దలు కొట్టారు.