ప్రధానిపై దాడి..జస్ట్ మిస్
Published on: Mon Aug 3, 2015 12:09PM

ఏకంగా ఓ దేశ ప్రధాని ప్రాణాలనే తీయాలని ప్రయత్నించాడు ఓ మాజీ సైనికుడు. అలా ప్రధాని ప్రాణాలు తీయడానికి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన కుటుంబసభ్యులతో కలిసి కారులో ముర్రీలోని హిల్ రిసార్ట్ నుంచి ఇస్లామాబాద్ కు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో ఆయన వెళ్తున్న కాన్యాయ్ పై రిటైర్ట్ ఎయిర్ కమాండర్.. మాజీ అధికారి హఫీజ్ ఉర్ రెహ్మాన్ ఒక్కసారిగా దాడికి దిగారు. ముందుగా రెహ్మాన్ ప్రధాని కారును ఓవర్ టేక్ చేసి.. ఆ తరువాత షరీఫ్ ఉన్న కారును తన కారుతో బలంగా ఢీకొట్టాడు. అయితే ఈ ప్రమాదంలో షరీఫ్ కుటుంబానికి ప్రాణాపాయం తప్పి సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు రెహ్మాన్ ను అదుపులోకి తీసుకొని ఒక ప్రధానిపై తాను దాడి చేయడానికి గల కారణాలు ఏంటి.. అసలు ప్రధానిపై అతనికి ఎందుకంత కసి అనే వివరాల తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


