కాశ్మీర్ మీద బేనజీర్ కొడుకు బిలావల్ భుట్టో అతి వాగుడు

 

పాకిస్థాన్ మాజీ ప్రధానులు బేనజీర్ భుట్టో, ఆసిఫ్ జర్దారీల కొడుకు బిలావల్ భుట్టో అతిగా వాగుతున్నాడు. కాశ్మీర్ విషయంలో పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తున్నాడు. పాకిస్థాన్ రాజకీయాలలో పాగావేసి తన తాత, అమ్మమ్మ, తల్లి, తండ్రి తరహాలోనే పాకిస్థాన్‌కి నాయకత్వం వహించాలని కలలు కంటున్న బిలావల్ కాశ్మీర్ విషయంలో పనికిమాలిన, తనకు మాలిన కామెంట్లు చేసి పాకిస్థాన్ ప్రజల దృష్టిలో హీరో అయిపోవాలని అనుకుంటున్నాడు. భవిష్యత్తులో తమ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కాశ్మీర్ మొత్తాన్నీ పాకిస్థాన్‌లోకి తీసుకొస్తుందని, కాశ్మీర్‌లో ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టదని, ఎందుకంటే కాశ్మీర్ పాకిస్థాన్‌కి చెందినది అని అన్నాడు.

 

అంతేలే, ఇండియాలోనే వున్న కొంతమంది దుష్టశక్తులు కాశ్మీర్ ఇండియాకి చెందినది కాదు అని నోటికొచ్చినట్టు వాగుతున్నప్పుడు పాకిస్థాన్ వాళ్ళు ఎందుకు వాగరు? నీలాంటి పిచ్చుకకి కొమ్ములు తెచ్చింది మావాళ్ళే! 2018లో పాకిస్థాన్‌లో జరిగే ఎన్నికలలో పోటీ చేసి పాకిస్థాస్‌కి ప్రధానమంత్రి అయిపోవాలని కలలు కంటున్న బిలావల్‌కి కాశ్మీర్‌ మీద కామెంట్లు చేయడం తప్ప మరేమీ చేతై చావదు కాబట్టి ఇలా అనవసరంగా నోరు పారేసుకుంటున్నాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఓవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ భారతదేశంతో సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెబుతూ వుంటుంది. మరోవైపు ఆ తానులో ముక్కే అయిన బిలావల్ మాత్రం నోటికొచ్చిన కామెంట్లు చేస్తూ వుంటాడు.

 

కాకపోతే బిలావల్ భుట్టో జర్దారీ తెలుసుకోవాల్సిన పాయింట్ ఏమిటంటే, భారతదేశంలో అంతర్భాగమైన కాశ్మీర్‌ని స్వాధీనం చేసుకోవడం తన తాత జుల్ఫ్‌కర్ అలీ భుట్టో వల్ల కాలేదు, తల్లి బేనజీర్ భుట్టోకి చేతకాలేదు. తండ్రి ఆసిఫ్ జర్దారీకి వీలు కాలేదు. పిల్లకాకి బిలావల్‌కీ కుదరదు. చూడు మిస్టర్ బిలావల్... నువ్వు పాకిస్థాన్‌కి ప్రధానమంత్రి కావడం, కాశ్మీర్‌ని ఇండియా నుంచి లాక్కోవడం సంగతి తర్వాత... ముందు పాకిస్థాన్‌ మిలటరీ నుంచి, అతివాదుల నుంచి, ఉగ్రవాదుల నుంచి నీ ప్రాణాలు కాపాడుకో చాలు. ఫ్యూచర్లో నువ్వు ప్రాణభయంతో పాకిస్థాన్ నుంచి పారిపోవాలనుకుంటే శరణార్థిగా బతకడానికైనా ఇండియాతో మర్యాదగా వ్యవహరించు.