పాకిస్థాన్ లో దారుణం... హిందూ మహిళ హత్య..
Published on: Thu Mar 9, 2017 2:04PM

పాకిస్థాన్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ హిందూ మహిళను అత్యంత దారుణంగా నరికి చంపారు. వివరాల ప్రకారం...బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో నసీరాబాద్ జిల్లాలోని బాబా కోట్ ప్రాంతానికి చెందిన హిందూ మహిళ అయిన జానియా కుమారిపై గుర్తు తెలియని కొందరు వ్యక్తులు దాడి చేసి చంపేశారు. అనంతరం అక్కడి నుండి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్బంగా జానియా కుమారి సోదురుడు జాలోరామ్ తన సోదరిని అన్యాయంగా చంపేశారని...కొందరు పలుకుబడి ఉన్న వ్యక్తుల పనేనని హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.


