పీఎం మోదీకి పాక్ యువతి థ్యాంక్స్.. ఎందుకంటే...
Published on: Wed Mar 9, 2022 11:31AM
ఉక్రెయిన్ నుంచి భారతీయుల రెస్క్యూలో ప్రధాని మోదీ అన్నివర్గాల మన్ననలు పొందుతున్నారు. కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు.. భారత పతాకం నీడలో పలు దేశాల ప్రజలు ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా బయటపడుతున్నారు. కేవలం రెస్క్యూ ఆపరేషన్ కోసమే.. రష్యాతో మాట్లాడి యుద్ధాన్ని కొన్ని గంటల పాటు ఆపించిన ఘనత మోదీకే దక్కుతుంది. విపక్షాల నుంచి విమర్శలు ఎలా ఉన్నా.. ఉక్రెయిన్ వార్ జోన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే ఆపరేషన్ గంగ.. జోరుగా సాగుతోంది. ఇప్పటికీ 16వేల మందికిపైగా పౌరులను భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు.
తాజాగా, ఓ పాకిస్థానీ యువతి.. పీఎం మోదీకి కృతజ్ఞతలు తెలపడం ఆసక్తికరంగా మారింది. ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతం నుంచి తనను సురక్షితంగా తరలించినందుకు భారత ప్రధాని మోదీకి, ఉక్రెయిన్ దేశంలోని భారత రాయబార కార్యాలయానికి పాకిస్థానీ యువతి కృతజ్ఞతలు తెలిపింది.
ఉక్రెయిన్‌లోని యుద్ధ ప్రాంతం నుంచి పాక్ యువతి అస్మా షఫీక్ ను కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం ఉద్యోగులు సురక్షితంగా తరలించారు. చాలా క్లిష్టపరిస్థితుల నుంచి తనకు సహాయం చేసిన భారత రాయబార కార్యాలయానికి, పీఎం మోదీకి పాక్ యువతి అస్మా ధన్యవాదాలు తెలుపుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.


