గంగలో కలిసిన పాకిస్థాన్ పరువు!
Published on: Sat Jul 11, 2026 11:56AM

పాకిస్థాన్ పరువు అంతర్జాతీయంగా గంగలో కలిసింది. ఆ దేశంలో సైనికాధికారులకే రక్షణ లేదన్న విషయం తేటతెల్లమైంది. ఇటీవలపాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ నడిబొడ్డున ఆ దేశ వైమానిక దళానికి చెందిన కీలక మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి కెప్టెన్ ఆసీమ్ తారీక్ తన సొంత కారులో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధానిలో.. అది కూడా అత్యంత భద్రత ఉండే ప్రాంతంలో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి దారుణ హత్యకు గురికావడం పాక్ ప్రభుత్వానికి, ఆ దేశ సైన్యానికి పెద్ద అవమానంగా మారింది. ఇక భద్రతా లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు పాకిస్థాన్ అబద్ధాల కథలల్లింది. వాటినే వాస్తవాలుగా అధికారికంగా ప్రకటనల రూపంలో వెల్లడించింది.
గుర్తుతెలియని మహిళను ఆపద నుండి రక్షించే క్రమంలో కెప్టెన్ ఆసీమ్ తారీక్ వీరోచితంగా పోరాడారని, ఆ పోరాటంలోనే ప్రాణాలు కోల్పోయారంటూ పాకిస్తాన్ సైనిక వర్గాలు ప్రకటించాయి. ఆ ప్రకటననే ఆ దేశ మీడాయా ప్రచురించింది, ప్రసారం చేసింది. అయితే.. ఒక రోజు వ్యవధిలోనే పాకిస్థాన్ సైన్యం, ప్రభుత్వం చెప్పినవన్నీ కట్టుకథలనీ ప్రపంచానికి వెల్లడైంది. ఎలాగంటే.. కెప్టెన్ ఆసీమ్ తారీక్ ను ఖతం చేసింది తామేనని ఉగ్ర సంస్థ తెహరిక్ ఏ తాలిబాన్ (టీటీపీ) ప్రకటించింది.
తమపై పాక్ సైన్యం చేస్తున్న దాడులకు ప్రతీకారంగానే మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారి ఆసీమ్ తారీక్‌ను వ్యూహాత్మకంగా హతం చేశామని టీటీపీ చేసిన ప్రకటన, అందుకు సాక్ష్యంగా విడుదల చేసిన వీడియోలు.. పాక్ ప్రకటనల డొల్లతనాన్ని ప్రపాంచానికి వెల్లడైపోయింది. ఈ ఘటన పాకిస్థాన్ లో రక్షణ వ్యవస్థ దయనీయతను ప్రపంచానికి చాటింది.
Pakistan fake story exposed, Islamabad military officer killed, Captain Asim Tariq, Pakistan army, Tehrik e Taliban Pakistan, TTP video proof


