కారు బాంబు దాడి.. 22 మంది మృతి..
Published on: Fri Mar 31, 2017 5:23PM

పాకిస్థాన్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయి బాంబు దాడులకు పాల్పడ్డారు. పాకిస్థాన్ లో షియా మతస్తులు ఎక్కువగా ఉండే కుర్రమ్ గిరిజన జిల్లాలోని పరచినార్ మార్కెట్ లో కారు బాంబు దాడి జరిపారు. ఈ దాడిలో 22 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు ఈ దాడికి పాల్పడింది తామే అంటూ ప్రముఖ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ ప్రకటించింది.


