TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

భారత మహిళల సిందూరం తుడిచిన ఉగ్రవాదులను అంతం చేశాం : ప్రధాని మోదీ

Published on: Tue May 13, 2025 4:45PM

 

పాకిస్థాన్ అణ్వాయుధాలను చూపించి భయపెట్టాలనుకుందని అవేమీ భారత్ ముందు చెల్లవని ప్రధాని మోదీ తెలిపారు. పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌‌లో  ప్ర‌ధాని పర్యటించారు. ఉగ్రవాదం అంతం చేస్తామని భారత ఆర్మీ చేస్తామని శపథం చేసిందని మన సైనికులు యుద్దక్షేత్రంలోనూ భారత్ మాతకీ జై నినాదాలు చేశారు. భారత సైనికుల శక్తిసామార్థ్యాలు చూసి నా జన్మ ధన్యమైందని ప్రధాని తెలిపారు. మన అక్కాచెల్లెళ్లు, కూతుళ్ల సిందూరం తుడిచిన ఉగ్రవాదుల నట్టింట్లోకి వెళ్లి చంపేశారని మోదీ పేర్కొన్నారు. ఫైటర్ జెట్ పైలట్స్ ను మోదీ కలిసారు.  ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న జవాన్లతో ప్రధాని ముచ్చటించారు.

ఈ సందర్బంగా మోడీ మాట్లాడారు. పాక్ న్యూక్లియర్ బాంబులతో భయపెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధంలో పోరాడిన సైనికులైన మీ దర్శనం కోసమే వచ్చాను… మీ ధైర్య సాహసాలను చూస్తే గర్వంగా ఉందని తెలిపారు. పాక్ డ్రోన్లు మన గగనతలాన్ని దాటలేకపోయాయని పేర్కొన్నారు. పాకిస్థాన్‌, ఇండియా మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం కుదిరిన నేప‌థ్యంలో.. ఇవాళ మోదీ ఆ ఎయిర్‌బేస్‌కు వెళ్లి ఐఏఎఫ్ సిబ్బందిని ప‌లుక‌రించారు. అదంపూర్ ఎయిర్ ఫోర్స్ స్టేష‌న్‌పై పాకిస్థాన్ అటాక్ చేయాల‌ని ప్ర‌య‌త్నించింది. మే 9 రాత్రి, 10వ తేదీల్లో శ‌త్రు దేశం ఆ ప్ర‌య‌త్నం చేసింది. మోదీ త‌న ఆకస్మిక ప‌ర్య‌ట‌న‌తో సైనికుల్లో మ‌నోధైర్యాన్ని నింపారు. వైమానిక సిబ్బందితో పాటు జ‌వాన్ల‌ను కూడా ఆయ‌న క‌లుసుకున్నారు.