Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాక్ ఎటు వైపు ?.. ఇరాన్ వైపా? అమెరికా వైపా?
posted on: Jun 22, 2025 10:24PM

అడ్డ కత్తెరలో పోక చెక్క అనే సామెత అతికినట్లు అక్షరాలా సరిపోయే ఏకైక దేశం పాకిస్తాన్. ఎందుకంటే 2026 నోబుల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని శనివారం (జూన్ 21) అన్న పాకిస్థాన్ ఆదివారం (జూన్ 22) మాట మార్చేసింది. ఇజ్రాయెల్ తో కలసి ఇరాన్ పై బాంబులు వేసిన అమెరికాను వ్యతిరేకించింది. ఇరాన్ ను వెనకేసుకు వచ్చింది. దీంతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది అమెరికా అధ్యక్షుల వారికి.
అరే ఇదేంటి.. పాకిస్థాన్ కి మనం ఇంత చేస్తుంటే అలా అనేసిందేంటని? వాపోవడం ట్రంప్ వంతు అయ్యింది. ఎవరు అవునన్నా కాదన్నా పాక్ ఇస్లామిక్ రెవల్యూషన్ కి కట్టుబడక తప్పదు. ఇరాన్ యూఎస్ రెండింటిలో పాక్ ఎటువైపు అంటే.. ఆ దేశానికున్న మత ఛాందస వాదం కారణంగా ఇరాన్ వైపు ఉండాల్సిందే.
కానీ అటు అమెరికా పాక్ కి బిలియన్ డాలర్ల కొద్దీ ఇటు ఐఎంఎఫ్, అటు వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు ఇప్పిస్తోంది. అంతే కాదు.. తన సొంత సంస్థ చేత కూడా పెట్టుబడులు పెట్టిస్తున్నారు ట్రంప్. ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఈ మాత్రమైనా కోకుకుందంటే అది అమెరికా చలవే అనడంలో సందేహం లేదు. గతంలో
యూఎస్ నుంచి పూర్తి సహాయ సహకారాలను కోల్పోయాక తన భూభాగంలోని బెలూచిస్తాన్ ని పణంగా పెట్టి చైనాతో చెలిమి చేసింది. అంతేనా ఆ సమయంలో చైనా అధ్యక్షుడు పాక్ వచ్చినపుడు.. తన సోదరుడి ఇంటికి వచ్చినట్టుందని అనడం అప్పట్లో సంచలనం సృష్టించింది. పాక్.. ఒక మతమా కాదు. ఒక భావజాలమా కాదు. అయినా సరే బలూచీ- ఖనిజాల కోసం వెంపర్లాట కారణంగా చైనా-పాకిస్థాన్ తో అలాయ్ బలాయ్ అంది. ట్రంప్ వచ్చే వరకూ పాక్ వెనక ఉన్న దేశమేదైనా ఉందంటే అది చైనా మాత్రమే. చైనా అంతగా ఆర్ధిక అండదండలు అందిస్తూ వచ్చింది.
అయితే ట్రంప్ రెండో సారి అమెరికా అధ్యక్షుడు అయిన తరువాత స్వరం మార్చారు. ఎలాగైనా సరే పాక్ ని కంట్రోల్లో పెట్టుకుని చైనాను కట్టడి చేయాలని స్కెచ్ వేశారు. పాక్ సైతం బెలూచిస్తాన్ వేరు పడితే.. చైనా అండదండలు ఆవిరైపోతాయని తెలిసి రివర్స్ స్కెచ్ వేసి అమెరికాతో చెలిమి మొదలు పెట్టింది. అయితే.. సరిగ్గా ఈ టైంలో ఇజ్రాయెల్ ఇరాన్ వార్ లోకి దిగడం. ఆ వార్ లో ట్రంప్ ఇజ్రాయెల్ కి వంత పాడటంతో ఇప్పుడు పాక్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. అయితే నైతికంగా ఎలాంటి విలువలు లేని కంట్రీ కాబట్టి.. ఈ బాయికాడ ఈ పాట- ఆ బాయికాడ ఆ పాట పాడుతూ మేనేజ్ చేస్తోంది. అందుకే ఇక్కడ ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి ఇవ్వాలన్న నోటితోనే ఆయన బాంబులు కురిపిస్తున్న ఇరాన్ కు మద్దతుగా ప్రకటనలు గుప్పిస్తోందంటున్నారు విశ్లేషకులు.



.webp)


