ఆ అమ్మాయిల్ని,పాక్ సైన్యమే సెక్స్ స్లేవ్స్ గా మార్చేస్తోందట!

 

బలూచిస్తాన్ అంశం మోదీ లేవనెత్తినప్పుడు పాకిస్తాన్ ఉడికిపోయింది. మరో రకంగా చెప్పుకోవాలంటే భయపడిపోయింది. ఇప్పటికీ పైపైకి ఎంత గంభీరంగా మాటలు మాట్లాడుతున్నా లోలోన బెదిరిపోతూనే వుంది.కారణం అరెస్సెస్ మేధావులు, మోదీ వెనుక వున్న అజిత్ ధోవల్ లాంటి అధికారుల సిద్దాంతం పాక్ ను మూడు, నాలుగు ముక్కలు చేయటమే. పాక్ ఇప్పుడున్న స్థితిలో ఎంత ఎక్కువ కాలం వుంటే భారత్ కు అంతం ఇబ్బంది అనేది కొందరి అభిప్రాయం.సంఘ్ ఐడియాలజీ నరనరాన వున్న మోదీ కూడా అందుకు వ్యతిరేకం ఏం కాదు. కాని, అందుకు తగిన సమయం మాత్రం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. 
భారత్ బలూచిస్తాన్ కు విముక్తి కల్పిస్తుందని అక్కడి ఉద్యమకారులు ఎప్పట్నుంచో ఆశిస్తున్నారు. కాని, గత డెబ్బై ఏళ్లలో ఎప్పుడూ మన పాలకులు ధైర్యంగా బలూచ్ విషయం లేవనెత్తలేదు. కాశ్మీర్లో నిజంగా లేనే లేని విముక్తి పోరాటాన్ని పాక్ ఐక్యరాజ్య సమితి దాకా తీసుకెళ్లినా మన వాళ్లు బలూచిస్తాన్ విషయంలో నోరు మెదపలేదు. కాని, మోదీ కొన్ని నెలల క్రితం బలూచ్ ఉద్యమం గురించి మాట్లాడటం అనేక కొత్త పరిణామాలకి దారీ తీసింది. మరీ ముఖ్యంగా, బలూచ్ నేతలకు, పోరాట యోధులకి కొత్త ఆశలు కలిగేలా చేసింది. ఆ క్రమంలోనే పాక్ అక్కడ చేస్తోన్న దారుణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 
పాకిస్తాన్ లో సైన్యం చేసే ఆకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇది అందరికీ తెలిసిందే అయినా ఇప్పుడు తాజాగా పస్తూన్ ఉద్యమకారుడు ఉమర్ ఖటక్ చెప్పిన విషయాలు ఒళ్లు జలదరింపజేస్తాయి. అఫ్గాన్ సరిహద్దులోని తమ ప్రాంతాలపై పాక్ సైనికులు రాక్షసుల్లా దాడి చేసి ప్రాణాలు తీస్తారని చెప్పాడు. అంతే కాదు, బుల్డోజర్లతో తమ ఇళ్లు నేల మట్టం చేసి జీవితాలు నేలపాలు చేస్తున్నారని వాపోయాడు. తమ నివాసాలు చెరిపేసి ఉగ్రవాదుల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారని ఉమర్ అన్నాడు. మరీ దారుణం ఏంటంటే, చాలా అందంగా వుండే పస్తూన్ అమ్మాయిల్ని పాక్ సైన్యమే లాహోర్ లాంటి నగరాల్లో సెక్స్ బానిసలుగా మార్చేస్తోందట. 
పాక్ నుంచి విడిపోయి స్వతంత్రంగా బతకాలని 1947నుంచే పోరాడుతున్న బలూచ్ ప్రజలు ఇస్లాబాద్ పాలకుల నుంచి అన్ని రకాల హింసల్ని ఎదుర్కొంటున్నారు. తమ మీద అణు దాడులు చేయటానికి పాక్ వెనుకాడకపోవచ్చని వారంటున్నారు. ఇప్పటికే పాక్ సైన్యం టార్చర్ తట్టుకోలేక 5లక్షల మంది పస్తూన్ ప్రజలు అఫ్గనిస్తాన్ వలస వెళ్లిపోయారని యూఎన్ఓ కూడా ఒప్పుకుంది. అయినా ప్రపంచ దేశాలు దీనిపై కిక్కురుమనటం లేదు. చైనా లాంటి దేశాలైతే నిశ్శబ్దంగా మద్దతు కూడా పలుకుతున్నాయి. మన భద్రత దృష్ట్యానే కాక మానవతా దృక్పథంతో కూడా బలూచ్ ప్రజలు, పస్తూన్ ప్రజలకు భారత్ విముక్తి కల్పించాల్సి వుంది. బంగ్లాదేశ్ విడదీసినట్టే మరో సారి పాక్ ను ముక్కలు చేయాలి. ఇది నైతికంగా తప్పే అయినా ప్రపంచ శాంతికి, మన సంక్షేమానికి ఎంతో కీలకం...