తెలంగాణ మంత్రి పద్మారావు కొడుకు లవ్ మ్యారేజ్
Published on: Wed Nov 4, 2015 6:30AM

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు కుమారుడు రామేశ్వర్‌గౌడ్ మంగళవారం నాడు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. రామేశ్వర్ గౌడ్‌కు పద్మారావు ఇప్పటికే మరో యువతితో నిశ్చితార్థం జరిపించారు. త్వరలో వీరి పెళ్ళి జరగాల్సి వుంది. అయితే పద్మారావు కుమారుడు ప్రేమించిన యువతిని రహస్యంగా వివాహమాడారు. ఆ తర్వాత పెళ్ళికూతురితో సహా ఇంటికి వచ్చిన అతనిని కుటుంబసభ్యులు ఇంట్లోకి అనుమతించలేదు.


