2011పద్మ అవార్డులు ..5 పద్మ విభూషణ
Published on: Wed Jan 25, 2012 2:05PM
న్యూ
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం 2011 సంవత్సరానికి పద్మ అవార్డులను ప్రకటించింది. రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ అవార్డులకు అంగీకారం తెలిపారు. ఈ యేడాది మొత్తం 109 అవార్డులను ఇవ్వనున్నారు. ఇందులో అయిదు పద్మ విభూషణ, 27 పద్మ భూషణ, 77 పద్మశ్రీ అవార్డులున్నాయి. అవార్డులు పొందిన వారిలో 19 మంది మహిళలున్నారు. ఈ అత్యున్నత పౌర అవార్డులను ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ అందుకున్నవారిలో కెజి సుబ్రమణ్యం, శ్రీ మారియో డి మరాండా, వోకల్ ఆర్టిస్ట్ భూపెణ్ హజారికా, డాక్టర్ కాంతిలాల్ హస్తిమల్, టీవీ రాజేశ్వర్ ఉన్నారు. అలాగే పద్మభూషణ అందుకున్నవారిలో సినీతారలు షబానా అజ్మీ, ధర్మేంద్ర, మీరా నాయర్‌లున్నారు. పద్మశ్రీ అందుకున్నవారిలో మన రాష్ట్రం నుంచి ముణిరత్నం (సామాజిక సేవ), సయ్యద్ మహ్మాద్ ఆరీఫ్ (బ్యాడ్మింటన్ కోచ్) ఉన్నారు. కాగా ఈ ఏడాదికి భారత రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించలేదు.


