పద్మ అవార్డులపై మోడీ స్పందన

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాలకు.. త్వరలో ఎన్నికలు జరగునున్న రాష్ట్రాలకే అవార్డుల్లో పెద్ద పీట వేశారంటూ కొందరు ఓపెన్‌గానే ప్రధాని మోడీపై నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రధాని స్పందించారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఆల్ ఇండియా రేడియోలో జాతినుద్దేశించి మాట్లాడిన మోడీ తాను ఎవరి సిఫార్సులు చూడనని.. అవార్డులు వాటంతటవే వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. గడిచిన మూడు సంవత్సరాలుగా పద్మ పురస్కారాల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా చేశామని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం పద్మ అవార్డులను చూసిన వారు ఎవరైనా ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఎంతో మంది సామాన్యులకు అవార్డులను దగ్గర చేశామని అన్నారు.. కేరళలోని లక్ష్మీ కుట్టి గుడిసెల్లో నివసించేందని.. అడవుల్లోని 500 రకాల మొక్కలను గుర్తు పెట్టుకుని.. వాటితో ఔషధాలు తయారు చేస్తున్నదని.. ఆమెను గత ప్రభుత్వాలు గుర్తించలేకపోవడం సిగ్గు చేటని అన్నారు.