పాడేరు ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతలు?
Published on: Fri Mar 16, 2012 3:50PM
విశాఖజిల్లా పాడేరు ఏజెన్సీ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్నారన్న సమాచారం అందడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. కొంతమంది కొరియర్ల ద్వారా పోలీస్ యంత్రాంగానికి మావోయిస్టు అగ్రనేతల ఉనికి తెలిసింది. దీంతో గ్రేహౌండ్స్, సరిహద్దు భద్రతాదళ సిబ్బంది ఒక్కసారిగా ఆ ప్రాంతంలో విరుచుకుపడ్డారు. గత మూడు రోజులుగా హెలీకాప్టర్ల ద్వారా సుమారు 300 మంది భద్రతా సిబ్బందిని పాడేరు ప్రాంతానికి తరలించారు. మావోయిస్టుల గాలింపు చర్యల్లో భాగంగా ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని విశాఖ మన్యంతోపాటు ఓడిశాలోని మల్కన్ గిరి, కోలాపుట్ జిల్లాలు, చత్తీస్ ఘడ్ లలో ముమ్మరంగా కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. గతంలో రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణ మళ్ళీ ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలియడంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు ప్రారంభించారు.


