TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంచి తరుణం మించిన రాదు

Published on: Mon Oct 29, 2012 12:08PM

PadaYatra's Time, State Level, Regional Level, Opposition Parties, Chandrababu Naidu, 5 thousand Rupees to Old Women, Sarees To Poor Women, YSRCP, Sharmila, Vallabhaneni Vamsi,

 

ఇది పాదయాత్రల టైమ్ రాష్ట్ర లెవల్లోనే కాకుండా రీజినల్ లెవల్లో కూడా దీన్ని ఇప్పుడు అన్ని ప్రధాన ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అయితే మాకేంటని ప్రజలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే తాము జీవితంలో ఎదుర్కొంటున్న సినిమా కష్టాలన్నీ సదరు నేతలతో చెప్పారనుకొండి వారు మీకు మేమున్నామంటూ అప్పటికప్ఫుడే సమస్యను రూపు మాపడానికి ఫోన్లు చేసి తత్ సంభందిత అధికారులతో మాటలాడి మీకు సహాయం చేస్తారు. అవసరమైతే ఆర్దిక సాయం కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు ఒక అవ్వకు 5 వేల రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. అలాగే పేద మహిళలకు చీరలు కూడా ఇస్తున్నారు. ఇక వైసిపి నాయకురాలు షర్మిల ఒక వికలాంగుడికి యం బి ఎ చదవటానికి అలాగే అనాధ పిల్లలకు ఆర్దిక సాయంతో బాటు వారి బాధ్యతలను కూడా తీసుకున్నారు. అవసరమైనప్పుడు ఫోన్ చెయ్యండంటూ ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నారు. వీరిని చూసి ఇన్ స్పయిర్ అయిన తెలుగుతమ్ముళ్లు కూడా ఎవరి నియోజక వర్గంలో వారు పాద యాత్రలుచేపట్టారు. దేవినేని ఉమ తన నియోజకవర్గంలో పర్యటించాలనుకుంటుంటే అదే పార్టీకి చెందిన టౌన్ ప్రసిడెంట్ వల్లభనేని వంశీ  నిన్నటి నుండే పాదయాత్ర మొదలు పెట్టారు. అందు వల్ల యావన్మంది ప్రజలు  ఈ పాద యాత్రలు ఉపయోగించు కోవడమే తరువాయి.