TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇంట్లోనే గంజాయి ప్యాకింగ్.. వాట్సాప్‌లో ఆర్డర్లు..!

Published on: Thu Aug 13, 2026 6:17PM

 

ర్యాపిడో, కొరియర్‌తో కస్టమర్లకు డెలివరీ..!

ఇంటినే గంజాయి ప్యాకింగ్‌, డెలివరీ కేంద్రంగా మార్చుకుని.. వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ.. కొరియర్‌, ర్యాపిడో వంటి మార్గాల్లో కస్టమర్లకు మాదకద్రవ్యా లను చేరవేస్తున్న కొత్త తరహా డ్రగ్స్‌ దందాను ఈగల్‌ ఫోర్స్‌ అధికారులు ఛేదించారు. బాలానగర్‌లోని ఓ ఇంటిపై ఈగల్‌ ఫోర్స్‌, హెచ్‌-న్యూ అధికారులు నిర్వహించిన మెరుపు దాడిలో 14.5 కిలోల గంజాయితో పాటు ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అధికా రులపైకి కుక్కలను వదిలి భయపెట్టే ప్రయత్నం చేయడంతో పాటు ఓ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల కంటపడకుండా గంజాయి విక్రయించేందుకు నిందితులు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. 

గుట్టు చప్పుడు కాకుండా ఒడిశా నుంచి గంజాయిని తీసుకొచ్చి ఇంట్లో నిల్వ చేసేవారని, అనంతరం దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేవారని తెలిపారు.అంతేకాకుండా రెగ్యులర్‌ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. కస్టమర్ల నుంచి ముందుగానే పేమెంట్‌ తీసుకుని.. వారి లొకేషన్‌ తెలుసుకుని.. కొరియర్‌ సేవలు, ర్యాపిడో వంటి డెలివరీ మార్గాల ద్వారా గంజాయిని చేరవేస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు పేర్కొన్నారు. పక్కా సమాచారంతో బాలానగర్‌లోని ఓ ఇంటిపై అధికారులు దాడి చేశారు. సోదాలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు తెలిపారు. అధికారులపైకి కుక్కలను వదిలి భయపెట్టేందుకు ప్రయత్నించడంతో పాటు.. ఓ ఇన్‌స్పెక్టర్‌పై కత్తితో దాడి చేయడంతో ఆయన చేతికి గాయమైనట్లు అధికారులు వెల్లడించారు.

మరో వ్యక్తి అధికారుల నుంచి తప్పించుకునేం దుకు నాలుగో అంతస్తు నుంచి దూకి పారిపోయేం దుకు ప్రయత్నించినట్లు ఈగల్‌ ఫోర్స్‌ డీఎస్పీ నర్సింగ్‌రావు తెలిపారు. ఇంట్లో నిర్వహించిన సోదాల్లో 14.5 కిలోల గంజాయి, ఓ ఎయిర్‌గన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇంటినే గంజాయి నిల్వ, ప్యాకింగ్‌, డెలివరీ కేంద్రంగా మార్చుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దందాతో సంబంధం ఉన్న దుర్గాప్రసాద్‌, కమలాకర్‌, కిరణ్‌ అనే ముగ్గురు అన్నదమ్ములతో పాటు కిరణ్‌ భార్యను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెట్‌ వర్క్‌ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎక్కడి నుంచి గంజాయి సరఫరా అవుతోంది? ఎంతకాలంగా ఈ దందా కొనసాగుతోంది? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణవ్యాప్తంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంపై ఈగల్‌ ఫోర్స్‌ విస్తృత ఆపరేషన్‌ చేపట్టింది. ఇప్పటివరకు 69 మంది డ్రగ్‌ స్మగ్లర్లు, 49 మంది డ్రగ్స్‌ వినియోగదారులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్మగ్లర్‌ నుంచి వినియోగ దారుడి వరకు.. మధ్యలో వాట్సాప్‌ నుంచి డెలివరీ వ్యవస్థ వరకు డ్రగ్స్‌ దందా కొత్త రూపం దాల్చుతున్న నేపథ్యంలో బాలానగర్‌లో వెలుగుచూసిన నెట్‌వర్క్‌ కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Packing marijuana at home, Eagle Force, Telangana police, Hyderabad police, CP Sajjanar. DGP C.V. Anand