గాయని పి.సుశీల సేఫ్..!
Published on: Tue Aug 20, 2024 2:21PM
ప్రముఖ గాయని పి.సుశీల ఆరోగ్యంగా వున్నారు. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళారు. 88 సంవత్సరాల వయసున్న పి.సుశీల గత కొద్ది రోజులుగా వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. రెండు రోజుల క్రితం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఆస్పత్రిలో చేరారు. అయితే, సుశీల ఆరోగ్యం విషయంలో రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో వచ్చాయి. సోషల్ మీడియా సంగతి ఎలా వున్నా, సుశీల ఆరోగ్యంగా వుండాలని కోట్లాదిమంది ఆమె అభిమానులు కోరుకున్నారు. అందరి కోరికలు ఫలించి ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ‘‘నేను ఆరోగ్యంగా వున్నాను. అందరి ఆశీస్సులతో నేను కుదుటపడ్డాను. నామీద వస్తున్న పుకార్లు నమ్మకండి’ అని సుశీల ఒక ప్రకటనలో తెలిపారు.


