TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రభుత్వంలో ఆందోళన..2జీ కేసుల్లో నేడు సుప్రీం తీర్పు

Published on: Thu Feb 2, 2012 9:49AM

న్యూఢిల్లీ : దేశ రాజకీయాలను ఓ కుదుపుకుదిపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కుంభకోణంలో యూపీఏ-1 ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ప్రస్తుత కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం పాత్రపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది.  నాటి ఆర్థికమంత్రిగా ఉన్నపుడు 2జీ లైసెన్సుల కేటాయింపులో చిదంబరం పాత్రపై విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటీషన్‌పై జస్టీస్ జీఎస్.సింఘ్వీ, ఏకే.గంగూలీలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపనుంది. అలాగే కేంద్ర టెలికామ్ మంత్రిగా ఏ.రాజా హయాంలో ఇచ్చిన 122 రేడియో వేవ్ లైసెన్స్‌ల రద్దుపైన దాఖలైన పిటిషన్‌పైన సుప్రీంకోర్టు గురువారం తన తీర్పును ప్రకటించనుంది. మరో కేసులో ప్రముఖ లాయర్ ప్రశాంత్‌ భూషణ్‌ 2జీ కింద జారీ చేసిన లైసెన్సులన్నీ అక్రమమే అని వాదిస్తున్నారు. వాటిని రద్దు చేయాలని భూషణ్ డిమాండ్ చేస్తున్నారు. మూడో కేసు.. 2జీ విచారణలో సీబీఐ పాత్రకు సంబంధించనది. సీబీఐ విచారణ సరిగా చేయడం లేదనీ, విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేయాలనీ భూషణ్‌ వాదిస్తున్నారు. మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం తీరుపై సుప్రీం అసంతృప్తిని వ్యక్తం చేసిన నేపథ్యంలో నేడు వెలువడనున్న తీర్పులపై ప్రభుత్వంలో ఆందోళన నెలకొంది.