భారత్ లో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ కు లైన్ క్లియర్

కరోనా మహమ్మారి నుండి కాపాడే వ్యాక్సిన్ ప్రయోగాలలో ముందంజలో ఉన్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ భారత లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన సంగతి తెల్సిందే. డిసిజిఐ నియమించిన నిపుణుల కమిటీ ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిదారైన సీరం ఇండియా సంస్థ కు కొన్ని సూచనలు చేసి ఆ మేరకు అభ్యర్ధన పత్రంలో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ దరఖాస్తు చేయాలనీ కోరింది. ఈ మేరకు సీరం ఇండియా సంస్థ తమ దరఖాస్తులో మార్పులు చేసి మళ్ళీ బుధవారం డిసిజిఐ కి అందించింది. దీని పై శుక్రవారం సమావేశమైన నిపుణుల కమిటీ ఆ అభ్యర్థనను పరిశీలించి వ్యాక్సిన్ ట్రయల్స్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా డిసిజిఐ కి సిఫారసు చేసింది. దీంతో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ త్వరలో మొదలు కానున్నాయి. దీంతో విశాఖ, మైసూర్, ఢిల్లీ తో సహా పన్నెండు నగరాలలోని సెలెక్ట్ చేసిన మెడికల్ కాలేజీలలో 1600 మంది వలంటీర్ల పై సీరం ఇండియా ట్రయల్స్ నిర్వహించనుంది.