కరోనా కు చెక్ పెట్టనున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్..

కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వైరస్ లక్షల మందికి సోకగా వేలాది మంది మృత్యువాత పడ్డారు. దీంతో ప్రజలు బయటకు రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. మరో పక్క వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా తో కలిసి సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్ కరోనాను ఎదుర్కోవడంలో పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం పై ఆక్స్ ఫర్డ్ శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే రెండు దశల వ్యాక్సిన్ పరీక్షలు పూర్తీ కాగా మూడో దశ పరీక్షలను కూడా మొన్నజూన్ నెలలో బ్రెజిల్ లో స్టార్ట్ చేసిన విషయం తెలిసందే. కరోనా ఉధృతి తీవ్రంగా ఉన్న బ్రెజిల్ లో వేలాది మంది పై ఈ వ్యాక్సిన్ తో జరిపిన ప్రయోగం విజయవంతమైందని ఐటీవీ పొలిటికల్ ఎడిటర్ రాబర్ట్ పెస్టన్, తన బ్లాగ్ లో వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలో యాంటీ బాడీలు, టీ-సెల్ (కరోనా వైరస్ కిల్లర్ సెల్) లను జనరేట్ చేసిందని, ఐతే దీని గురించిన అత్యంత ముఖ్యమైన సమాచారం ఈ రోజు తెలుస్తుందని ఆయన అన్నారు. ఈ వ్యాక్సిన్ తో జరిపిన ప్రయోగాలు పూర్తిగా సక్సెస్ ఐతే వచ్చే సెప్టెంబర్ లో భారీ స్థాయిలో తయారు చేసి ప్రజలకు అందిస్తారని వార్తలు వస్తున్నాయి.