ఉస్మానియా వద్ద ఉద్రిక్తత పరిస్థితులు

 

 

OU tense as students clash over 'T', OU tense as students clash

 

 

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఛలో అసేంబ్లీకి అనుమతి కోరుతూ ఉస్మానియా విద్యార్థులు ర్యాలీగా వస్తుండగా ఎన్ సీసీ గేటువద్ద పోలీసులు వారిని అడ్డుకుని లాఠీఛార్జ్ చేసి భాష్పవాయువు ప్రయోగించారు. దీంతో విద్యార్థులు తిరగబడి రాళ్లదాడికి దిగారు. అక్కడి పరిస్థితిని చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా లైవ్ వాహనాల కేబుల్ ను పోలీసులు కత్తిరించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. నిన్న కూడా ఆందోళనకు దిగిన తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థుల మీద కూడా పోలీసులు లాఠీఛార్జ్ చేసి భాష్పవాయివు ప్రయోగించారు. ఈ రోజు పోలీసుల కళ్లుగప్పి సిటీ బస్ లో అసేంబ్లీ వద్దకు చేరుకున్న ఉస్మానియా విద్యార్థులు అసేంబ్లీ 2 వ గేటు నుండి లోనికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. మరో వైపు తెలంగాణ ప్రాంతంలో అక్రమ నిర్భంధాలను నిలిపివేయాలని కోరుతూ సాయంత్రం 4:30 నిమిషాలకు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్ నర్సింహన్‌ను కలవనున్నారు. అరెస్టుల విషయమై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.