ఉద్రిక్తంగా మారిన ఓయూ
Published on: Sat Sep 7, 2013 11:28AM

సమైక్య ప్రత్యేక ఉద్యమాల నేపధ్యంలో హైదరాబాద్ రణరంగం మారనుంది. ఏపిఎన్జీవోల సభకు సమయం దగ్గర పడుతున్న కొద్ది నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇప్పటికే ఎల్బీ స్టేడియం నిజాం కళాశాల పరిసర ప్రాంతాల్లో యుద్ద వాతవరణం కనిపిస్తుండగా. తాజాగా ఓయూ పరిసర ప్రాంతాల్లో కూడా అలాంటి పరిస్ధితులే ఏర్పాడాయి.
ఏపిఎన్జీవోల సభను అడ్డుకొని తీరాతామని ముందు నుంచి చెపుతూ వస్తున్న ఓయు జెఎసి నాయకులు అందుతో భాగంగా ఓయూ క్యాంపస్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు ర్యాలిగా బయలు దేరారు దీంతో ఓయు పరిసర ప్రాంతాలు మరోసారి వేడెక్కాయి. పోలీసులు విద్యార్థులను అడ్డుకోవాడానికి ప్రయత్నించటంతో విద్యార్ధులు పోలీసుల పైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్ధులను అదుపు చేయడానికి స్వల్పంగా లాఠిచార్జ్ చేశారు.


