TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణా ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్ధులకు కాంట్రాక్టు ఉద్యోగాలు?

Published on: Thu Sep 18, 2014 7:10PM

 

ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఒక ఆసక్తికరమయిన కధనం వచ్చింది. తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన దాదాపు డజను మంది విద్యార్ధి నేతలను అదే విశ్వవిద్యాలయంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా తెలంగాణా ప్రభుత్వం నియమించినట్లు ఆ పత్రిక కధనం. అంతే కాక తెలంగాణాలో ఉన్న మిగిలిన విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విద్యాసంస్థలలో గల దాదాపు 350 తాత్కాలిక పోస్టులకు కూడా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న విద్యార్ధి నేతలకే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని కధనం. అయితే ఇప్పటి వరకు నియమితులయిన డజను మంది జాతీయ అర్హత పరీక్షలలో ఉతీర్ణులు కాలేదని, ఇప్పడు చేప్పట్టిన ఉద్యోగాలకి తగిన అర్హతకూడా కలిగిలేరని, ఆ పత్రికకు ఉస్మానియాకు చెందిన అధికారి ఒకరు చెప్పినట్లు వ్రాసింది.

 

తెలంగాణ ఉద్యమాల కోసం విద్యార్ధులు తమ చదువులు, జీవితాలను పణంగా పెట్టి పోరాడారు. కానీ వారి త్యాగాల ఫలాలను కొందరు రాజకీయ నాయకులు ఆస్వాదిస్తున్నారిప్పుడు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే విద్యార్ధులకు బంగారు భవిష్యత్ కల్పిస్తామని చెప్పిన వారు ఇప్పుడు వారిలో కొందరికి మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగాలు విదిలించడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.