అట్టహాసంగా ఆస్కార్ అవార్డుల వేడుకలు
Published on: Mon Feb 27, 2012 10:52AM
లాస్
ఏంజిల్స్: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుగా చూస్తున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం లాస్ఏంజల్స్ కొడాక్ థియేటర్లో జరుగుతోంది. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో హ్యూగో చిత్రం ఇప్పటికే నాలుగు ఆస్కార్‌లను దక్కించుకుంది. సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం, సౌండ్ ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో హ్యూగో సినిమా ఆస్కార్లను కైవసం చేసుకుంది.
ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్ - హ్యూగో
ఉత్తమ విదేశీ భాషా చిత్రం - ఏ సపరేషన్ (ఇరాన్)
ఉత్తమ సహాయ నటి - ఆక్టావియా స్పెన్సర్ (ద హెల్ప్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - రాబర్డ్ రిచర్డ్సన్ (హ్యూగో)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - మార్క్ బ్రిడ్జెస్ (ది ఆర్టిస్ట్)
ఉత్తమ మేకప్ - మార్క్ కౌలియర్ , జే రాయ్ హేలాండ్ (ద ఐరన్ లేడీ)


