మరోసారి 'ఆపరేషన్ వశిష్టాను' కొనసాగించటానికి రంగంలోకి దిగనున్న ధర్మాడి సత్యం బృందం...

 

గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా ఎటువంటి పురోగతి లేకపోవడంతో ఆపరేషన్ వశిష్టా ఇక ఆగిపోయినట్లేనా అనే అనుమాలు అందరిలో నెలకొన్నాయి. అయితే  మొదటి ప్రయత్నంలో విఫలమైన ధర్మాణి సత్యం బృందం రెండో ప్రయత్నం కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే బోటును వెలికితీయటం ఎంతవరకు సాధ్యం అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది. 

బోటు మునిగి నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ గల్లంతైన వారి వివరాలు పూర్తిగా తెలియనేలేదు. ప్రాణాలతో బయటపడ్డ ఇరవై ఆరు మంది తప్ప గల్లంతైనవారు ఎంతమంది అన్న లెక్క ఇప్పటికీ తేలని లేదని చెప్పాలి. అధికారులు మాత్రం ఇంకో పధ్నాలుగు మంది ఆచూకీ తెలియాల్సి ఉందని చెబుతున్నారు.సెప్టెంబర్ 15 వ తేదీ న కచ్చులూరు దగ్గర ఊహించని విధంగా గోదావరిలో మునిగి పోయింది రాయల్ వశిష్ట బోటు. ఇప్పుడది మూడు వందల అడుగులకుపైగా లోతులో ఉంది. దాదాపు నలభై అయిదు టన్నులకు పైగా బరువున్న రాయల్ వశిష్ట బోటును వెలికితీస్తే గానీ అందులో చిక్కుకున్న మృతదేహాల సంఖ్య తేలే పరిస్థితి లేదు. అయితే బోటును వెలికితీయటం ఎలా ఇప్పుడు ఇదే అతిపెద్ద సమస్యగా మారింది. 

బోటును బయటకు తీయడం కోసం సాంకేతిక పద్ధతులు అన్నీ అనుసరించారు.బోటు పడనున్న లోతులను కనిపెట్టడం తప్ప దాన్ని బయటకు లాగే మార్గాలేవి దొరక లేదు. దీంతో సంప్రదాయ పద్ధతుల్లో మాత్రమే బోటును బయటకు లాగగలనని ఆలోచన కు వచ్చారు. ఈ విధానంలో ముప్పయ్యేళ్ల అనుభవం ఉన్న ధర్మాడి సత్యంకు ఈ బాధ్యతలు అప్పగించారు .కాంట్రాక్ట్ తీసుకున్న మరుసటి రోజునే ధర్మాడి సత్యం టీమ్ కచ్చులూరుకు వెళ్ళింది. ఐరన్ రోపులతో, ప్రొక్లెయినర్ లు తీసుకొని లంగర్ లు వేసి బోటు మునిగి ఉన్న ప్లేస్ ను గుర్తించింది. కానీ బయటకు లాగేందుకు చేసిన వారి తొలి ప్రయత్నం విఫలమైంది. ఐరన్ రోప్ తెగి పోవడంతో సత్యం ఆపరేషన్ కు బ్రేక్ పడింది. ఇప్పటికీ సత్యం బృందం బోటును వెలికితీస్తామని నమ్మకం తోనే ఉంది.అయితే ఇటు ఉగ్రరూపం దాల్చిన గోదావరి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ఆపరేషన్ వశిష్టకు పెద్ద ఆటంకంగా మారింది. అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త కుదుట పడడం గోదావరి ల వరద తగ్గడంతో మళ్లీ సత్యం టీం ఆపరేషన్ వశిష్టకు సిద్ధమవుతోంది.

సోమవారం సాయంత్రం ధర్మాణి సత్యం టీమ్ కచ్చులూరుకు చేరుకోబోతోంది. బోటు తమ లంగర్లలకు చిక్కి బయటకు లాగేందుకు పట్టు దొరికితే రెండురోజుల్లోనే ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్తోంది ధర్మడి సత్యం టీమ్. సాయంత్రం కచ్చులూరు చేరుకోబోతున్న ధర్మడి సత్యం టీమ్ మళ్లీ  ఆపరేషన్ మొదటి నుంచి మొదలు పెట్టబోతోంది మొదటి ప్రయత్నం కోసం తెచ్చుకున్న సామాగ్రి మొత్తాన్ని మళ్లీ ఇప్పుడు కచ్చులూరుకు తరలించాల్సి ఉంది. గోదావరి సహకరించి వర్షం తగ్గితే ధర్మం సత్యం రెండో ప్రయత్నం మొదలుకానుంది.ఈ సారి ఐనా ఏ అవంతరాలు లేకుండా జరగుతుందో లేదో వేచిచూడాలి.