TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కడపలో ఆపరేషన్ మొబి ట్రాక్ సక్సెస్.. రూ.70లక్షల విలువైన ఫోన్ల రికవరీ

Published on: Thu Apr 9, 2026 9:51AM

కడప జిల్లాలో  ఆపరేషన్ మొబి ట్రాక్  లో  భారీ స్థాయిలో మొబైల్ ఫోన్లు రికవరీ అయ్యాయి.  ఈ సందర్భంగా రూ.70 లక్షల విలువైన 505 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేసినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాధ్ తెలిపారు. సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్‌వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.

ఇప్పటివరకు మొత్తం ఎనిమిది విడతల్లో రూ.11.76 కోట్ల విలువైన 5877 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ నిచికేత్ విశ్వనాథ్ వివరించారు. మొబైల్ ఫోన్లు కోల్పోయిన వారు సంబంధిత పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ట్రాకింగ్ సులభమై వేగంగా ఫోన్లు తిరిగి పొందగలిగారని తెలిపారు. కాగా పోయిన తమ ఫోన్లు దొరికడంతో.. బాధితులు జిల్లా పోలీసులకు, ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.

సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం అపరిచిత కాల్స్, సందేశాలకు స్పందించవద్దని, మొబైల్ పోయిన వెంటనే బ్యాంక్ ఖాతాలు, సిమ్ కార్డు భద్రత చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. అలాగే  సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. జిల్లా లో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో  సైబర్ క్రైమ్ టీం - ఇన్స్పెక్టర్  ఏ.మధు మల్లేశ్వర రెడ్డి,  సంభందిత సిబ్బంది అందరిని అభినందించడం జరిగింది.