TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం.. తెలుగు సంప్రదాయం నచ్చింది : మిస్ వరల్డ్‌

Published on: Sun Jun 1, 2025 4:11PM

 

హైదరాబాద్ వేదికగా జరిగిన మిస్‌ వరల్డ్-2025 పోటీల్లో 72వ మిస్ వరల్డ్‌గా థాయ్‌లాండ్  సుందరి ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ టైటిల్ గెల్చుకున్న విషయం తెలిసిందే. సుచాత మరిన్ని ఆసక్తికర విశేషాలు వెల్లడించారు. థాయ్ లాండ్ లోని ఫుకెట్ లో సుచాత జన్మించారు. ఆమె తల్లిదండ్రులు తానెట్ డోంక్‌మనెర్డ్, సుపత్రా చువాంగ్ శ్రీ. చువాంగ్ శ్రీ కుటుంబానికి థాలాంగ్‌లో బిజినెస్ ఉంది. ప్రాథమిక విద్యాభ్యాసం ఫుకెట్ లోనే పూర్తిచేసిన సుచాత.. బ్యాంకాక్ లో ఉన్నత విద్య పూర్తిచేశారు. ప్రస్తుతం బ్యాంకాక్ లోని థమ్మసాట్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్నారు. ఈ మేరకు రూ.8.5 కోట్ల నగదుతో పాటు 1,770 వజ్రాలు పొదిగిన కిరీటం సుచాత సొంతమైంది. 

అదేవిధంగా ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు కూడా ఆమె అర్హురాలైంది. ఈ సందర్భంగా ఓపల్ సుచాత సువాంగ్‌శ్రీ మీడియాతో మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకరమైందని అన్నారు. తెలంగాణలో తన ఫేవరెట్ ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ అని చెప్పింది. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కలిసి మళ్లీ తెలంగాణకు వస్తానని తెలిపారు. 16 ఏళ్లకే రొమ్ము కేన్సర్‌కు గురయ్యాను. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో వ్యాధి నుంచి తప్పించుకున్నాని మిస్  వరల్డ్ పేర్కొన్నారు. కానీ ఆ సమయంలో నా శారీరక, మానసిక అవస్థ వర్ణనాతీతం. మహిళలను వేధించే ఈ సమస్యను దూరం చేయాలంటే ప్రజల్లో అవగాహన చాలా అవసరమని గుర్తించానఃన్నారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే నివారణ సాధ్యమన్న విషయం ప్రతి మహిళకు చేరేలా ప్రచారం చేస్తున్నాను. ఇది సత్ఫలితాన్నిస్తోంది. నాకు మా అమ్మే స్ఫూర్తి. 

తెలంగాణలో ఉంటే సొంతింట్లో ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. ఇక్కడి సంస్కృత, మనుషులు, పర్యాటక ప్రదేశాలు అద్బుతం అని పేర్కొన్నారు. బహుబలి సినిమా గురించి తాను విన్నానని ఆ సినిమా చూసి రివ్యూ ఇస్తానని తెలిపారు. ఓపల్ సుచాతా గత నాలుగేళ్లుగా మోడలింగ్ రంగంలో ఉన్నారు. ఆమె తన అందాల పోటీల ప్రస్థానాన్ని 2021లో మిస్ రత్తనకోసిన్ పోటీలతో ప్రారంభించారు. 2022లో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్ పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత రెండో రన్నరప్ తప్పుకోవడంతో ఆమె రెండో స్థానానికి ప్రమోట్ అయ్యారు. మిస్ వరల్డ్ అవ్వాలన్న కళ ఎట్టకేలకు సాకరమైందని అన్నారు. అందుకోసం తాను చాలా కష్టపడ్డానని తెలిపారు. తల్లితండ్రులు తనకు ఎంతగానో సహకారం అందించారని గుర్తు చేశారు