క‌న్నీళ్లు పెట్టించిన ఓ మ‌ల్లి

posted on: Jul 26, 2013 8:27PM

 

ఇన్నాళ్లు న‌టిగా చిన్న పాత్రలు వ్యాంప్ రోల్స్ మాత్రమే చేసిన ర‌మ్య శ్రీ ఇప్పుడు ద‌ర్శకురాలిగా మారింది.. తన స్వీయ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కించిన సినిమా ఓ మ‌ల్లి.. హాట్ హాట్ పోస్టర్స్‌తో ఆక‌ట్టుకున్న ర‌మ్య త‌న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావ‌డానికి రెడీ అవుతుంది.

భారీ అందాల ప్రద‌ర్శన‌తో తెర‌కెక్కిన ఈ సినిమా ఇటీవ‌లే సెన్సార్ పూర్తి చేసుకుంది.. ఎక్కువ‌గా క‌ట్స్ ఏం ప‌డ‌కున్నా ఏ స‌ర్టిఫికేట్‌తో రిలీజ్‌కు రెడీ అవుతుంది ఓ మ‌ల్లి. అంతేకాదు తానే లీడ్ రోల్‌లో న‌టించిన ఈ సినిమా ప్రశంస‌ల‌తో పాటు అవార్డుల‌ను కూడా సాదించి పెడుతుంద‌ని ఆశ‌ప‌డుతుంది ర‌మ్య.

ఇటీవ‌ల ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డ్ స‌భ్యులు క‌న్నీళ్లు పెట్టుకోవ‌టంతో త‌న న‌ట‌న‌తో పాటు డైరెక్షన్ కూడా వంద మార్కులు ప‌డ్డాయంటూ ఫీల్ అవుతుంది ర‌మ్య శ్రీ.. మ‌రి ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఈ సినిమా థియేట‌ర్స్‌లో అభిమానుల‌ను ఎంత‌వ‌ర‌కు అల‌రిస్తుందో చూడాలి.

google-ad-img
    Related Sigment News
    • Loading...