TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య పట్ల నారా లోకేష్ దిగ్భ్రాంతి

Published on: Tue Apr 22, 2025 10:30PM

టీడీపీ అధికార ప్రతినిధి నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి వార్త నన్ను షాక్ కు గురిచేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒంగోలులోని తన కార్యాలయంలో వీరయ్య చౌదరిని దుండగులు అంత్యత కిరాతకంగా నరికి చంపడం దారుణమని పేర్కొన్నారు. యువగళం పాదయాత్రలో నాతోపాటు అడుగులు వేసిన వీరయ్య చౌదరి పార్టీలో ఎంతో క్రియాశీలకంగా పనిచేసారు. హంతకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించాం. వీరయ్య చౌదరి కుటుంబానికి టీడీపీ పార్టీ అండగా నిలుస్తుందని లోకేష్ తెలిపారు.

లిక్కర్ బిజినేస్‌లో కూడా వీరయ్య చౌదరి ఉన్నారు. జిల్లాలో పలు చోట్ల మద్యం దుకాణాలు నిర్వహణలో సిండికేట్‌గా ఈయన వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది.ఈ మద్యం సిండికేట్‌ వ్యవహారాలతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారల ఆర్ధికంగా వివాదాలు కారణంగా ఆయనపై హత్య జరిగినట్లు భావిస్తున్నారు. ఎస్పీ దామోదర్‌ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. అపార్టుమెంట్​లో ఉన్నవారిని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్‌ హటాహుటిన వెళ్లి వీరయ్య చౌదరి మృతదేహాన్ని సందర్శించి, శ్రధ్ధాంజలి ఘటించారు. ఒంగోలు నగరం నడిబొడ్డులో హత్య సంఘటన పట్టణవాసులకు దిగ్భ్రాంతిని కలిగించింది.