TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ ఓడిపోతారన్న వైసీపీ నేత మిస్సింగ్! ఒంగోలులో కలకలం...

Published on: Sun Dec 19, 2021 3:06PM

ఆ ముగ్గురి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు లాస్.. ఇలాగైతే జగన్ గెలవడం కష్టమంటూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలపై వైసీపీ నేత సుబ్బారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అధికార పార్టీలో ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ప్రస్తుతం సుబ్బారావు ఆచూకీ లభ్యం కావటం లేదు. కుటుంబ సభ్యులు సుబ్బారావుకు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. తమ కుటుంబానికి సుబ్బారావు ఒక్కరే ఆధారమని ఆయన భార్య గుప్తా నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన భర్తకు ఏమైందోనని ఆందోళన చెందుతోంది. తన భర్త ఆచూకీ కోసం ఎదురు చూస్తోంది.

మంత్రి కొడాలినానిపై సుబ్బారావు వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సైతం ఘాటుగానే స్పందించారు. రాత్రి వైసీపీ కార్యకర్తలు సుబ్బారావు ఇంటిపైదాడికి సైతం పాల్పడ్డారు. ఆ సమయంలో సుబ్బారావు ఇంట్లో లేకపోవటంతో బైకు తదితర సామగ్రిని ధ్వంసం చేశారు. అనంతరం సుబ్బారావు కుటుంబ సభ్యులను దుర్బాషలడుతు వారిని భయబ్రాంతులకు గురిచేశారు. కొడాలి నానిని విమర్శించే స్థాయి మీకెక్కిడిదంటూ దుర్బాషలాడారు. ఈ నేపథ్యంలో సుబ్బారావు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. వైసీపీ నేతలే ఆయన్ను ఎక్కడికైనా తీసుకెళ్లారా లేక దాడులు చేస్తారామోనని భయపడి సుబ్బారావే ఎక్కడైనా దాక్కున్నారా అన్నది తెలియడం లేదు. 

ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని జన్మదిన కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీలు వైసీపీకి మిత్రులో, శత్రువులో అర్థం కావడం లేదు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉంది. ఇలాగే వ్యవహరిస్తే పార్టీకి తీవ్ర నష్టం ఖాయం. ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే కర్రలు తీసుకొని వెంటబడి కొడతారు’’ అని సుబ్బారావు వ్యాఖ్యానించారు.