ఒంగోలు కాంగ్రెస్ లో విభేదాలు
Published on: Thu Mar 8, 2012 11:29AM
ఒంగోలు : ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మరింత పెరిగాయి. ఈ వివరాలు కారణంగా ఇంతవరకు ఆ నియోజకవర్గం నుంచి పోటీచేయబోయే కాంగ్రెస్ అభ్యర్ధిని ఎంపిక చేయలేకపోయారు. మరోవైపు తెలుగుదేశం,వైయస్సార్, కాంగ్రెస్ కు తమ అభ్యర్ధులను ఎంపిక చేసి ఎన్నికల సమరానికి సిద్దం చేశాయి. జిల్లా కాంగ్రెస్ లో పట్టుకోసం ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి, రాష్ట్రమంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక ఒక కొలిక్కి రావడం లేదు. వీరిద్దరూ తమకు అనుకూలంగా వున్నవారికే టిక్కెట్టు ఇప్పించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వీరి కార్యకలాపాలు అధిష్టానానికి కూడా తననొప్పిగా మారాయి.


