TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఈ నెల 18 నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే..!

Published on: Tue Aug 11, 2026 1:10PM

 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టనున్న అండర్‌పాస్, ఫ్లైఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే విధానాన్ని కొనసాగించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వన్‌వే అమలుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న రెండు లైన్ల రోడ్లలో ఇకపై ఒకే దిశలో వాహనాల రాకపోకలకు అనుమతి ఇవ్వనున్నారు. 

అదేవిధంగా చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు ఉన్న రెండు వైపుల రోడ్లలో ట్రాఫిక్‌ను అనుమతించనున్నారు. నిర్మాణ పనుల కారణంగా వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అండర్‌పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ వన్‌వే విధానం కొనసాగనుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.

One-way around KBR Park, Jubilee Hills, Underpass, flyover, Panjagutta, Checkpost, flyovers, CM Revanth rddy, CP Sajjanar