TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాక్సినేషన్‌కు వన్ ఇయర్.. గ్రేట్ ఇండియా అచీవ్‌మెంట్‌..

Published on: Sun Jan 16, 2022 1:55PM

దేశ వ్యాప్తంగా కొవిడ్ -19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది. గత సంవత్సరం ఇదే రోజున  దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. చరిత్రలో ఈ రకమైన అత్యంత భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడు లేదని తెలిపారు. గత ఏడాది జనవరి, 16న ఆరోగ్య కార్యకర్తలకు తొలుత  ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. తర్వాత ఫిబ్రవరి, 2న ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రాధాన్య క్రమంలో 60ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ వేశారు. 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి, 1న వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభమైంది. గత ఏడాది, మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ వ్యాక్సినేషన్ అమలు జరుగుతూ వస్తోంది.  ఈ నెల 10వ తేదీ నుంచి ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏళ్లు పైబడిన వారికీ ఫ్రికాన్షరీ డోస్ వేస్తున్నారు. కాగా..దే శ వ్యాప్తంగా  అమలు జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 156 కోట్ల 63 లక్షల డోసులు పంపిణీ చేశారు. నిన్న 56 లక్షల 29 వేల డోసులు వేశారు. 42 లక్షల 69 వేల ప్రికాషన్ డోసులు ఇప్పటి వరకు వేశారు. 

కాగా,ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమై ఏడాది పూరైన సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ శాస్ర్తవేత్తలు, ఆరోగ్య కార్యకర్తలను, దేశ ప్రజలను అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం ప్రపంచంలో అత్యంత విజయవంతమైన వ్యాక్సినేషన్ గా ప్రశంసలు అందుకుందని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. 
అలాగే, దేశ వ్యాప్తంగా భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో  నిరంతర కృషిని అందించిన లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలు, వైద్యులు, శాస్ర్తవేత్తలు, ప్రజలకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కృతజతలు తెలిపారు. గడచిన సంవత్సరమంతా దేశం యావత్తు కొవిడ్-19 కు వ్యతిరేకంగా సంఘటితంగా పోరాడిందని , ఈ రోజు వ్యాక్సినేషన్ వార్షికోత్సవం సందర్భంగా జేపీ నడ్డా ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో 135 కోట్ల మంది జనాభా ఉన్న మనదేశంలో ప్రారంభించిన కీలకమైన వ్యాక్సినేషన్ యాత్ర విజయవంతమై ప్రపంచమంతటా అభినందనలు అందుకున్నదని ఆయన అన్నారు.