తెరపైకి మళ్లీ.. వన్ నేషన్- వన్ ఎలక్షన్
Published on: Thu Mar 10, 2022 2:24PM
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, వన్ నేషన్ వన్ ఎలక్షన్’కు సంబందించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ స్వాగతించదగియన్ సూచన అన్నారు. ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆ విధంగా, ఓట్ల లెక్కింపు నడుమ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చర్చకకు సీఈఓ తెర తీశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర పలు అంశాలపై స్పందించారు.
ఈ సంధర్భంగా సీఈసీ వన్ నేషన్ వన్ ఎలక్షన్’ సూచనకు సానుకూలంగా స్పందించారు. “ఇది మంచి సూచన. అయితే దీనికి రాజ్యాంగంలో మార్పు అవసరం” అని అన్నారు అంతే కాదు, చట్ట సవరణ సాధ్యమైతే, అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని అన్నారు.ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. నిజానికి గతంలోనూ కేంద్ర ఎన్నికల సంఘం వన్ నేషన్ వన్ ఎలక్షన్’ ప్రతిపాదనను స్వాగతించింది. అయితే, ఒకే సారి ఎన్నికలు నిర్వహించేందుకుకు ఎన్నిక సంఘం సిద్దంగా ఉందని సీఈసీ చెప్పడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా అనే ప్రశ్న తలెత్తుతోందని పరిశీలకులు అంటున్నారు.
ఇక ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలపైనా సీఈసీ స్పందించారు. ఈవీఎం ట్యాంపరింగ్ అనే సమస్యే లేదని చెప్పారు. ఎన్నికల సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుకూలమ లేదా వ్యవహరించదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,900 మంది అభ్యర్థులలో 1,600 కంటే ఎక్కువ మంది నేర నేపథ్యం ఉన్నవారున్నారని తెలిపారు.


