తెలంగాణలో మరో సర్వే: కేసీఆర్
Published on: Wed Sep 10, 2014 6:24PM
.jpg)
మొన్నామధ్యే తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సర్వే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణలో వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు సంబంధించి 15 రోజుల్లో సర్వే నిర్వహించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మూడున్నరేళ్లలో ప్రతి ఇంటికి మంచి నీరు అందించాలనే లక్ష్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. జీవనదుల ఆధారంగా గ్రిడ్లను ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెప్పారు. తాజాగా నిర్వహించే సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.


