TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రెండు కంటైనర్లు ఢీ.. ఒకరు సజీవదహనం

Published on: Thu Jan 29, 2026 9:32AM

కాకినాడ జిల్లా కత్తిపూడి జాతీయ రహదారిపై గురువారం (జనవరి 29) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  అన్నవరం నుంచి రాజమండ్రీవైపు చేపల ఫీడ్ తో వెడుతున్న కంటైనర్ ను వెనుక నుంచి మరో కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

సంఘటన జరిగిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో  ఒక కంటైనర్ క్లీనర్ సజీవదహనమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి కొలకత్తా వాసిగా గుర్తించారు.