TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆధార్ ఉచిత అప్ డేట్ గడువు  మళ్ళీ పెంపు 

Published on: Wed Dec 13, 2023 11:18AM

ఆధార్ కార్డు ఉన్న వారికి కేంద్రం శుభవార్త అందించింది. ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. ఫ్రీగా తప్పులు సవరించుకునేందుకు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు అనేక అవకాశాలు ఇచ్చింది. తాజాగా, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునేందుకు కేంద్రం మరోసారి గడువు పొడిగించింది. గతంలో పొడిగించిన గడువు ఈ డిసెంబరు 14తో ముగియనుంది. 
తాజాగా గడువు పొడిగించిన మేరకు 2024 మార్చి 14 వరకు ఆధార్ అప్ డేట్ ఉచితం కానుంది. గడువు ముగిసిన తర్వాత ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలంటే రుసుం చెల్లించాల్సి ఉంటుంది. 
ఆధార్ కార్డు పొంది పదేళ్లు పూర్తయితే... తప్పనిసరిగా తమ డెమొగ్రాఫిక్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం చెబుతోంది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారక సంస్థ (యూఐడీఏఐ) నిబంధనల మేరకు తాజా ఐడీ కార్డు (రేషన్ కార్డు/ఓటరు కార్డు/పాస్ పోర్టు/కిసాన్ ఫొటో పాస్ బుక్/టీసీ/ మార్కుల జాబితా/పాన్/ఈ-పాన్/డ్రైవింగ్ లైసెన్స్)తో చిరునామా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా కరెంటు బిల్లులు, టెలిఫోన్ బిల్లులు, వాటర్, గ్యాస్ బిల్లులను కూడా చిరునామా ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని యూఐడీఏఐ చెబుతోంది. అయితే ఈ బిల్లులు ఇటీవల మూడు నెలల్లోపు చెల్లించినవి అయ్యుండాలి.